ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన విధంగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమ్మెకు, ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరచి దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే రాజాపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. ప్రభుత్వ దోపిడీని ప్రజల్లో ఎండగడతామని, రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా సీఎం దిగజారి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.