పూర్వ వీసీని విచారించిన సీఐడీ | cid investigates retired vc | Sakshi
Sakshi News home page

పూర్వ వీసీని విచారించిన సీఐడీ

Mar 31 2014 1:37 AM | Updated on Oct 9 2018 7:52 PM

పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారులు ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పూర్వ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఐవీ రావును విచారించారు.

పీజీ మెడికల్ ఎంట్రన్స్ కేసు


విజయవాడ, న్యూస్‌లైన్:  పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారులు ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పూర్వ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఐవీ రావును విచారించారు. శనివారం వర్సిటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు డాక్టర్ రావును విచారించిన సీఐడీ.. కొన్ని విషయాలపై తరచితరచి ప్రశ్నించినట్టు సమాచారం. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెబుతూ ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది.

 

అడిషనల్ ఎస్పీ రవిప్రకాశ్  నేతృత్వంలో డీఎస్పీలు రఘు, సిరేన్‌బేగం తదితర అధికారులు ఐవీ రావుతో పాటు వర్శిటీ ఓఎస్‌డీ కోటయ్య, పరీక్షల విభాగం జాయింట్ రిజిస్ట్రార్ అనురాధ, సూపరిం టెండెంట్ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్ విభాగం జాయింట్ రిజిస్ట్రార్ ప్రతాప్, అడ్మిషన్ల విభాగం డిప్యూటీ రిజస్ట్రార్ రవీంద్ర, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సత్యనారాయణ, పరీక్షల విభాగానికి సంబంధించిన కొంతమంది కీలక ఉద్యోగులను కూడా విచారించారు. పరీక్షల విభాగానికి సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement