బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | child marriage stopped by officers | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Nov 6 2013 12:33 AM | Updated on Sep 2 2017 12:18 AM

మరో నాలుగు రోజుల్లో జరగాల్సిన బాల్య వివాహాన్ని జిల్లా అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని సింగూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు ఈ నెల 10న వివాహం జరిపించాలని తల్లిదండ్రులు నిశ్చయిం చారు.

పుల్‌కల్, న్యూస్‌లైన్ :  మరో నాలుగు రోజుల్లో జరగాల్సిన బాల్య వివాహాన్ని జిల్లా అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని సింగూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు ఈ నెల 10న వివాహం జరిపించాలని తల్లిదండ్రులు నిశ్చయిం చారు. అయితే విషయాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన బాల్యవివాహాల నిరోధక శాఖ అధికారులు, ఐసీడీఎస్, వైద్య అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం వారిని మండల కేంద్రంలో తహశీల్దార్ దశరథ్‌సింగ్, ఎంపీడీఓ హేమలతమ్మ సమక్షంలో హాజరుపరిచారు.

వీరికి మెదక్ చైల్డ్ డెరైక్టర్ ఎంఎస్ చంద్ర కౌన్సెలింగ్ నిర్వహిం చారు. చిన్నతనంలో వివాహం చేస్తే జరిగే అనార్థాల గురించి తెలియజేశారు. బాల్యవివాహలు చేస్తే దానికి కారణమైనా తల్లిదండ్రులు, పెళ్లి పెద్దలు, పెళ్లి చేసిన ప ంతులపై కేసులు పెడతామని హెచ్చరిం చారు. 18 ఏళ్ల లోపు వారంతా బాలలేనని, పిల్లల కూ హక్కులు ఉంటాయని తెలపడంతో పెళ్లిని తాత్కాలి కంగా రద్దు చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు తెలి పారు. ఈ మేరకు తహశీల్దార్‌కు రాతపూర్వకంగా ఇచ్చారు.  
 మన జిల్లాలోనే ఎక్కువ
 బాల్య వివాహలు గత ఏడాదితో పోలిస్తే అన్ని జిల్లాలో కన్నా మెదక్‌లో ఎక్కువని జిల్లా చైల్డ్ డెరైక్టర్ ఎంఎస్ చంద్ర అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 85 బాల్య వివాహలను అడ్డుకున్నట్లు వివరించారు. మాత, శిశు మరణాలు లేకుండా చూడాలని, అందుకోసమే బాల్య వివాహలు జరుగకుండా నిరోధిస్తున్నామన్నారు. బా ల్య వివాహలు ఎక్కడ జరిగిన 1098కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వివరాలు గోప్యంగా ఉంచటం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement