ఆడ పిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిన ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో జరిగింది.
ఆడ పిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిన ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట సుందరయ్యనగర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని మహిళ వదిలి వెళ్లింది. పసికందు ఏడుపు విని స్థానిక మహిళలు అక్కడికి చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో ఉన్న శిశువుకు చికిత్సలు అందిస్తున్నారు.