రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీఏ కమిషనర్తో పాటు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలపై కోర్టులో కేసు వేస్తామని పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాల వారు తెలిపారు.
రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీఏ కమిషనర్తో పాటు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలపై కోర్టులో కేసు వేస్తామని పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాల వారు తెలిపారు. 45 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.
న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బాధిత కుటుంబాల సభ్యులు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో కలిసి అఖిలపక్ష నాయకులతో పాటు ముఖ్యమంత్రిని కలిసి బాధితులకు న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తామని పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాల సభ్యులు చెప్పారు.