చెవిరెడ్డి దీపావళి కానుక

chevireddy bhasker reddy distribute diwali gifts - Sakshi

దీపావళి సందర్భంగా నూతన వస్త్రాలను పెట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

నియోజకవర్గంలో 6,100 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి దుస్తుల పంపిణీ

సాక్షి, తిరుపతి: కోటికాంతులీనే దీపావళి పండుగకు ఓ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులకు, కిందిస్థాయి సిబ్బందికి, ప్రతి ప్రజాప్రతినిధులకు కొత్త దుస్తులు అందజేసి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ పెద్దన్న పాత్ర పోషించారు. అందరూ తన కుటుంబ సభ్యులే అని చాటి చెప్పారు. ఏటా దీపావళిని పురస్కరించుకుని కొత్త దుస్తులు అందజేసే సుసంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. రూ.35 లక్షలు వెచ్చించి నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు, సింగిల్‌ విండో డైరెక్టర్లకు  దుస్తులు అందజేశారు.

ఎంపీడీఓ, తహసీల్దార్, ఏఈలు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, తలారి,  అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సాక్షర భారత్‌ కో–ఆర్డినేటర్లు్ల, అటెండర్లు ఇలా అన్ని వర్గాలకూ దుస్తులు అందజేశారు. ప్రత్యేకంగా 25 బృందాలను ఏర్పాటు చేసి మంగళవారం ప్రతి ఇంటికీ వెళ్లి  పంపిణీ చేశారు. మొత్తం 6,100 మందికి నూతన వస్త్రాలను పంచిపెట్టి కుటుంబంలో ప్రతి ఒక్క రూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలు, సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top