తహసీల్దార్ వాహనంపై రాళ్లతో దాడి | chennur tahsildar attacked by sand mafia | Sakshi
Sakshi News home page

తహసీల్దార్ వాహనంపై రాళ్లతో దాడి

Aug 18 2014 10:52 PM | Updated on Apr 4 2019 2:50 PM

వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలం తహసీల్డార్పై సోమవారం రాత్రి దాడి జరిగింది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలం తహసీల్డార్పై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై ఇసుక అక్రమ రవాణాదారులు రాళ్లతో దాడి చేశారు. మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలను గుర్తించిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

వాహనం ధ్వంసమవగా, సిబ్బంది గాయపడ్డారు. టీడీపీ నాయకులే దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దాడి సంఘటన గురించి తహసీల్డార్  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement