విజయనగరం ఇండస్ట్రీయల్‌ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం

Chemical Blast Occurred In Vizianagaram Industrial Area - Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలోని బొబ్బిలి ఇండస్ట్రీయల్‌ గ్రోత్‌ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని బాలీజీ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని జగదీష్‌(35), పలాంటి సురేష్‌(30)గా గుర్తించారు. క్షతగాత్రులను బొబ్బిలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫ్యాక్టరిలోని బాయిలర్‌ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top