చిత్తూరు జిల్లాలోని డ్యాముల ద్వారా కిందికి వదిలే నీటిని తగ్గించే అవకాశం ఉంటే ఆమేరకు చర్యలు చేపట్టి తమకు పరోక్షంగా సహాయం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తమళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని డ్యాముల ద్వారా కిందికి వదిలే నీటిని తగ్గించే అవకాశం ఉంటే ఆమేరకు చర్యలు చేపట్టి తమకు పరోక్షంగా సహాయం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తమళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులోని వర్షాలు దానివల్ల పోటెత్తిన వరద నీటి గురించి ఆందోళన చెందిన చంద్రబాబు తమిళనాడుకు ఎలాంటి సహాయం అయినా చేస్తామని ప్రకటించారు. దీంతో చిత్తూరులో పిచ్ఛటూరు ఇతర డ్యాముల నుంచి కిందికి వదిలే నీటిని తగ్గించడం ద్వారా తమకు కొంత ఊరట నిచ్చినట్లవుతుందని, ఆ మేరకు సహాయం చేస్తే తాము సంతోషిస్తామని ఆయన అన్నారు. ఇలా చేయడం ద్వారా తిరువళ్లూరు జిల్లా వరద బారిన పడకుండా ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావుకు పోన్లో విజ్ఞప్తి చేశారు.