'చంద్రబాబు తప్పించుకోవడం ఖాయం' | Chandrababu will surely escape from his stand over Telangana, says Ch.vidhyasagar rao | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు తప్పించుకోవడం ఖాయం'

Dec 14 2013 12:34 PM | Updated on Sep 2 2017 1:36 AM

'చంద్రబాబు తప్పించుకోవడం ఖాయం'

'చంద్రబాబు తప్పించుకోవడం ఖాయం'

రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి రాష్ట్రపతికి పంపాలని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి రాష్ట్రపతికి పంపాలని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదని విద్యాసాగర్ రావు అన్నారు.

 అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ విషయంలో చంద్రబాబు తప్పించుకోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృత్యర్థం ఆదివారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాసాగర్ రావు తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి 'రన్ ఫర్ యూనిటీ' ప్రారంభం అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement