పరువు తీస్తున్నారు: చంద్రబాబు | Chandrababu naidu video conference with cabinet colleagues | Sakshi
Sakshi News home page

పరువు తీస్తున్నారు: చంద్రబాబు

Nov 16 2014 12:44 PM | Updated on Aug 18 2018 6:18 PM

పరువు తీస్తున్నారు: చంద్రబాబు - Sakshi

పరువు తీస్తున్నారు: చంద్రబాబు

రాష్ట్రంలో ఆర్డీవో బదిలీలకు కోట్ల రూపాయిల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్డీవో బదిలీలకు కోట్ల రూపాయిల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబు... తన కేబినెట్లోని మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీల విషయంలో అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా వస్తున్నాయి... ఈ నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన మంత్రులకు సూచించారు. అధికారుల బదిలీల కోసం రచ్చకెక్కడం సరికాదని మంత్రులకు హితవు పలికారు.

బదిలీలపై రచ్చ చేసి ప్రభుత్వ పరువు తీస్తున్నారని చంద్రబాబు మంత్రులపై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆర్డీవోల బదిలీలపై సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవడం సరికాదని కొంతమంది మంత్రులు ఈ సందర్భంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement