ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామ నవమి వేడుకలకు దూరంగా ఉండనున్నారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామ నవమి వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఆయన కుమారుడు లోకేష్కు కుమారుడు పుట్టినందున మైల సందర్భంగా ఒంటిమిట్టలో నిర్వహించే నవమి ఉత్సవాలకు హాజరు కావటం లేదని సమాచారం. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వేరే వ్యక్తుల ద్వారా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.