'చంద్రబాబుకు భయం పట్టుకుంది' | Chandrababu naidu fear of YSR Congress Party | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు భయం పట్టుకుంది'

Feb 27 2014 7:54 PM | Updated on Sep 2 2017 4:10 AM

వైఎస్‌ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై విభజనకు సహకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు.

ఏలూరు: వైఎస్‌ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై విభజనకు సహకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. కుమ్మక్కై రాజకీయాలతో ఆరు కోట్ల సీమాంధ్ర ప్రజలతో ఆడుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలోకి వస్తే జగన్‌ సుపరిపాలన ద్వారా టీడీపీ కనుమరుగవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు.

ప్రజాసంక్షేమం కోసం పోరాడింది వైఎస్ కుటుంబం మాత్రమేనని, రాజన్న రాజ్యం రావడానికి ఎంతో దూరం లేదన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం వైఎస్ జగన్‌ వల్లే సాధ్యమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వీరు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాల రాజేష్‌కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement