
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.
ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్ నాకు ఫోన్ చేయలేదని అన్నారు.