
మసిపూసి.. మాయచేసి.. అధికారంలోకి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మసిపూసి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
భోగాపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మసిపూసి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రావాడ గ్రామంలో దంతులూరి సూర్యనారాయణరాజు (రావాడ బాబు) ఇంటి వద్ద ఆదివారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా కోలగట్ల, తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం జరిగిన సభలో కోలగట్ల మాట్లాడుతూ, ఎన్నికల హామీలు నెరవేర్చలేక ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబునాయుడు రాజధాని అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకువస్తున్నాడన్నారు.
రైతు, డ్వాక్రా రుణమాఫీలు ఒక్క రూపాయి కూడా చేయలేదన్నారు. పదేళ్ల వరకూ హైదరాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకునే వీలున్నప్పటికీ ముఖ్యమంత్రి కొత్త రాజధానిపైనే ఎందుకు దృష్టి సారిస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. తన అనుచరులైన సీఎం రమేష్, మంత్రి నారాయణ, సుజనా చౌదరి వంటి వ్యక్తులు కొన్న వేలాది ఎకరాలకు ధరను తెప్పించేందుకు ముఖ్యమంత్రి తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకమూ అమలు కాలేదన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం కలి గినా ఆదుకోవడానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, తుపాను వెళ్లిపోయి 40 రోజులు దాటుతున్నా అధికారులు ఇంకా సర్వేలు చేపడుతున్నారన్నారు. రైతులకు పరిహారం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.
నియోజకవర్గ కన్వీనర్ పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ, త్వరలో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు మామిడి అప్పలనాయుడు, అంబళ్ల శ్రీరాములనాయుడు, పతివాడ అప్పలనాయుడు, సింగుబాబు, జైహింద్‌కుమార్, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రావాడ బాబు, వరుపుల సుధాకర్, కొమ్మూరు సుభూషణరావు, శిరుగుడి గోవిందరావు, ఆళ్ల విశ్వేశ్వరరావు, అడపా ప్రసాదరావు, దారపు లక్ష్మణరెడ్డి, సవరవిల్లి శ్రీనివాసరావు, కర్రోతు పైడిరాజు, మద్దిల శంకరరావు, ములుకుర్తి శ్రీనువాసరావు, చిట్టిరాజు, మైలపల్లి ఎల్లారావు, శీరపు గుర్నాథరెడ్డి, బర్రి చిన్న అప్పన్న, పిడుగు రాంబాబు, పిడుగు చిట్టిబాబు, ఇమ్మిడిశెట్టి రమేష్, దల్లి శ్రీను, రమేష్ రాజు, బూతి నాగమణి, గుండపు సూరిబాబు, పల్లంట్ల శ్రీనివాసరావుతో పాటు 22 పంచాయతీల మాజీ, ప్రస్తుత సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, రావాడ గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రజలు బాధపడుతున్నారు
డెంకాడ : టీడీపీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. డెం కాడ గ్రామంలో జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో చంద్రబాబునాయుడు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాబు మాటలు నమ్మి రైతు లు, డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వచ్చే నెల ఐదున కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉం టామని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, సురేష్‌బాబు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు బర్రి చినప్పన్న, పార్టీ నాయకులు ఎస్.కోట నాయకుడు, వి.చినరామునాయుడు, మామిడి అప్పలనాయుడు, పతివాడ అప్పలనాయుడు, పి.జైహింద్ కుమార్, నడిపేన శ్రీను, పూసపాటి రామభద్రరాజు, బంటుపల్లి వాసుదేవరావు, కరుమజ్జి త్రినాథరావు, కనకల రామారావు, బమ్మిడి వెంకటరమణ, కలిశెట్టి బాలాజీ, చిం తపల్లి రామ్మూర్తి, బోని అప్పలనాయుడు, విజి నిగిరి అచ్చుంనాయుడు, బాబు, సువ్వాడ రమేష్ పాల్గొన్నారు.