ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు | chandra babu naidu fires on mp ravindra babu | Sakshi
Sakshi News home page

ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు

Jun 30 2015 6:01 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు - Sakshi

ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు

'ఫ్రీ ఫుడ్...ఫ్రీ డ్రింక్... ఫ్రీ హాలిడేస్...' అంటూ సైనికులపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: 'ఫ్రీ ఫుడ్...ఫ్రీ డ్రింక్... ఫ్రీ హాలిడేస్...' అంటూ సైనికులపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సైనికులపై ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా ముందు పద్ధతిగా మాట్లాడాలని పదేపదే చెబుతున్నా.. ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసే ఇటువంటి వారితోనే పార్టీకి లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు.

 

ఈ వ్యవహారంపై సదరు ఎంపీ నుంచి 24 గంటలలోగా రాతపూర్వకంగా సంజాయిషీ తీసుకోవాలని పార్టీ నేతలను మంగళవారం ఆదేశించారు.  ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపాడుతున్న సైనికులపై ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి నేటి వరకూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని గౌరవం ఉందని గుర్తచేశారు. ఎంపీ మాటల్ని పార్టీ అభిప్రాయాలుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement