కారు బోల్తా.. మహిళ మృతి | car roll in chittoor distirict | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. మహిళ మృతి

Jun 25 2015 9:14 AM | Updated on Sep 3 2017 4:21 AM

కారు బోల్తా.. మహిళ మృతి

కారు బోల్తా.. మహిళ మృతి

మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

తిరుపతి: మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతెపల్లి గ్రామ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. తమిళనాడుకు చెందిన కారు(టీఎన్ 77జడ్ 2545) చిత్తూరు నుంచి తిరుమలకు వస్తుండగా గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతురాలుకి చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement