10 కిలోల గంజాయి పట్టివేత | Capture up to 10 kg of marijuana | Sakshi
Sakshi News home page

10 కిలోల గంజాయి పట్టివేత

Aug 4 2014 1:28 AM | Updated on Aug 21 2018 5:46 PM

పెనుగంచిప్రోలులో పోలీ సులు ఆదివారం 10 కిలోల గంజాయిని ఎక్సైజ్, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

  •  పెనుగంచిప్రోలులో ఘటన
  •  పోలీసుల అదుపులో యువకుడు
  • పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలులో పోలీ సులు ఆదివారం 10 కిలోల గంజాయిని ఎక్సైజ్, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొందరు వ్యక్తులు అందించిన సమాచారంతో ఎస్సై నాగప్రసాద్, నందిగామ ఎక్సైజ్ సీఐ సురేంద్రరెడ్డి, రెవెన్యూ అధికారులు సిబ్బంది తో స్థానిక తుఫాన్ కాలనీలోని గుండగాని గోపాలరావు ఇంటిపై దాడి చేశారు. అక్కడ 10 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకు ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

    గ్రామానికి చెందిన పెనుగొండ గోపాలరావు, తాను కలిసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నవరంగ్‌పూర్ పట్టణంలో ఒక వ్యక్తి నుంచి కిలో రూ.2,500 ధరకు 20 కిలోల గంజాయిని కొనుగోలు చేశామని గుండగాని గోపాలరావు పోలీసుల విచారణలో చెప్పాడు. అక్కడినుంచి సరుకును తీసుకువచ్చి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఖమ్మం పట్టణంలో రక్తపరీక్ష కేంద్రం నిర్వహిస్తున్న శ్యామ్ అనే వ్యక్తి వద్దకు వెళ్లామని తెలిపాడు.
     
    కిలో ధర రూ.9 వేలు అని చెప్పగా, తాను ఇప్పుడు కొనుగోలు చేయలేనని శ్యామ్ చెప్పాడని గోపాలరావు చెప్పాడు. దీంతో 10 కిలోల గంజాయి ప్యాకెట్‌ను వైరా వద్ద కాల్చివేశామన్నా డు. మిగతాది ఇంటికి తీసుకువచ్చి దాచామని తెలి పాడు. దీనిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నాడు. గతంలో ఎప్పుడూ గంజాయి అమ్మలేదని పోలీసులకు వివరించాడు. ఆర్‌ఐ రవి, వీఆర్వో లావణ్యల సమక్షంలో పంచనామా నిర్వహించి గోపాలరావును ఎస్సై, ఎక్సైజ్ సీఐకు అప్పగించారు. ఈ మేరకు గుండగాని గోపాలరావు, పెనుగొండ గోపాలరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. పెనుగొండ గోపాలరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  
     
    అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
     
    తుఫాన్ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా సారా విక్రయా లు, జూద శిబిరాల నిర్వహణతో పాటు తా జా గా గంజాయి అమ్మకాలకు నిలయంగా మా రింది. అధికారులు కూడా అంతగా పట్టించుకోకపోవటంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్టుకట్ట వేయాలని స్థానికులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement