విశాఖపట్ణణం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో ప్రయాణీలకు సురక్షితంగా బయటపడ్డారు.
చింతపల్లి టౌన్: విశాఖపట్ణణం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. జిల్లాలోని తుని డిపోకు చెందిన బస్సు చిత్రకొండ నుంచి తునికి వెళుతుండగా లంబసింగి ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.