నకిలీ మద్యం గుట్టురట్టు..! | Bursting of fake alcohol | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యం గుట్టురట్టు..!

Aug 30 2013 12:36 AM | Updated on Mar 28 2018 10:56 AM

వ్యవసాయ పొలంలో తయూరుచేస్తున్న నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం సీఐ ఎం.డి.బషీరుద్దీన్ తెలిపిన వివరాలు

మహేశ్వరం, న్యూస్‌లైన్:వ్యవసాయ పొలంలో తయూరుచేస్తున్న నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం సీఐ ఎం.డి.బషీరుద్దీన్ తెలిపిన వివరాలు.. కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామ శివారులో నగరానికి చెందిన శ్యాంలాల్ పొలాన్ని అదే గ్రామానికి చెందిన డేరంగుల పెద్ద రాములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్వం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డితో ఇతనికి పరిచయుం ఉంది. వీరిద్దరూ కలిసి మూడు నెలలుగా పొలంలో రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యాన్ని తయూరు చేస్తున్నారు.
 
  ఇక్కడ తయూరు చేసిన నకిలీ మద్యాన్ని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు తరలించి వీరు సొవుు్మ చేసుకుంటున్నారు. ఈ విషయుమై సవూచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం రాత్రి  ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజన్‌రావు, డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్‌రావుల ఆదేశాల మేరకు వీరి స్థావరంపై దాడి చేసి నకిలీ వుద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు డ్రమ్ముల రెక్టిఫైడ్ స్పిరిట్ మత్తు పదార్థం, 15 కాటన్ల నకిలీ వుద్యం బాటిళ్లు, 30 లీటర్ల విస్కీ, డూప్లికేట్ లేబుల్స్, 10 కిలోల ప్లాస్టిక్ మూతలు, ఒక హైడ్రోమీటర్, 30 లీటర్ల ఫ్యారమిల్ ప్లవర్,
 
  ఓ స్కూటర్ ఉన్నాయి. వీటి విలువ రూ. 1.20 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పెద్ద రాములును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించామని, ప్రధాన నిందితుడు రవీందర్‌రెడ్డి పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. అయితే ఇదివరకే వుహబూబ్‌నగర్‌లోని పలు కేసుల్లో రవీందర్‌రెడ్డి నిందితుడిగా ఉన్నట్లు ఆయున తెలియ జేశారు. ఈ దాడిలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు సీఐలు లక్ష్మణ్‌నాయక్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement