నాలుగు పూరి గుడిసెలు దగ్ధం | burnt Four huts | Sakshi
Sakshi News home page

నాలుగు పూరి గుడిసెలు దగ్ధం

Feb 9 2015 8:54 AM | Updated on Sep 2 2017 9:02 PM

కృష్ణా జిల్లా జామి మండలంలోని మంగళవీధిలో నాలుగు పూరి గుడిసెలు సోమవారం తెల్లవారు జాము 3 గంటలకు దగ్ధమయ్యాయి.

విజయనగరం(జామి): కృష్ణా జిల్లా జామి మండలంలోని మంగళవీధిలో నాలుగు పూరి గుడిసెలు సోమవారం తెల్లవారు జాము 3 గంటలకు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని తెలిసింది. స్థానికులు సమాచారాన్ని ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయటంతో సంఘటనా స్థలికి చేరుకున్నారు.

ఫైర్ ఇంజన్ల వచ్చేసరికి గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. కేవలం మొండి గోడలు మాత్రమే మిగిలాయి. చుక్క రాములమ్మ, చుక్క అర్జున, చుక్క అచ్చిబాబు, చుక్క కృష్ణలకు చెందిన గుడిసెలు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. సుమారు లక్షరూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement