అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఫిబ్రవరి 29 లేదా మార్చి 1 నుంచి సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 29 లేదా మార్చి 1వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసిన తరువాత మార్చి తొలి వారం చివరల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను 17 పనిదినాలతో ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిపక్షంలో ఉండగా ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వీలైనన్ని తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని చూడటం గమనార్హం.