లయ తప్పిన బీఎస్‌ఎన్‌ఎల్‌

BSNL Not Working in Visakhapatnam Agency Area - Sakshi

ఆరు రోజులుగా మోగని మొబైల్‌ ఫోన్లు

నెట్‌ సేవలకూ అంతరాయం   

విసుగెత్తిపోతున్న వినియోగదారులు

పాడేరు: బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు ఏజెన్సీలో లయ తప్పాయి. పాడేరు ప్రాంతంలో ఆరు రోజులుగా ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. మొబైల్‌ ఫోన్లు మూగనోము పట్టాయి. ఈ ప్రాంతంలోని 8 మండలాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలే ఆధారం. మొబైల్‌ ఫోన్లు మోగకపోవడంతో వినియోగదారులు విసుగెత్తిపోతున్నారు. ఫోన్‌ కాల్స్‌ వెళ్లకపోగా తప్పుడు సంకేతాలతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఫోన్‌ చేస్తే కాల్‌ ఫార్వడ్‌ చేయబడుతోంది అనే సంకేతం వినిపిస్తోంది. ఈ నెల 5వ తేదీ రాత్రి నుంచి 6వ తేదీ సాయంత్రం 7గంటల వరకు సేవలు పూర్తిగా స్తంభించాయి.

నెట్‌ కూడా పనిచేయలేదు. అయితే అంతకు ముందురోజే పాడేరు ఏజెన్సీలో జియో సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆరోజు నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు మొరాయిస్తుండడంతో వినియోగదారుల్లో పలు సందేహలు వ్యక్తమవుతున్నాయి. జియో మొబైల్‌ నుంచి ఫోన్‌చేస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ లైన్‌ దొరుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు.ఈ నెల 12నుంచి పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణం స్పందించి బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం లేకుండా మెరుగపరచాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top