బకాయిలే బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు కారణం

BSNL Loss With NPAs In West Godavari - Sakshi

ఏలూరు(టూటౌన్‌): బకాయిలు పేరుకుపోవడమే బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు కారణమని ఆ సంస్థ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం కార్యాలయంలో నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్కర్స్, పశ్చిమగోదావరి జిల్లా శాఖ 7వ జిల్లా మహాసభ ఉపాధ్యక్షుడు వి.రామయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. నష్టాలతో కూడిన రూరల్‌ ఏరియా సర్వీసులు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇస్తున్నప్పటికీ ఆనష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయకపోవటం వల్ల ఈ నష్టాలు మరింత పెరిగిపోతున్నాయని అసోసియేషన్‌ కార్యదర్శి కేఎస్‌ఆర్‌ మూర్తి అన్నారు. నెలకు రూ.60 వేలు జీతం పొందుతున్న ఉద్యోగులు యూనియన్‌ పదవి అడ్డుపెట్టుకుని డ్యూటీలు ఎగ్గొడుతున్నారని, సంస్థ నష్టాలకు ఇదికూడా ఒక కారణమన్నారు.

కేవీ రత్నాజీ తాడువాయి ఎక్చేంజీలో పనిచేస్తూ గతేడాది సెప్టెంబర్‌ 19న మరణిస్తే నేటి వరకూ అతని కుటుంబానికి పెన్షన్, గ్రాట్యూటీ, ఇన్సూరెన్స్‌ చెల్లించలేదని పేర్కొన్నారు. గతంలో ముగ్గురు లైన్‌స్టాఫ్‌ పనిచేసిన చోట ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారన్నారు. అయినా వారితోనే ఫోను సమస్యలతో పాటు, సిమ్‌ కార్డులు అమ్మడం, కస్టమర్స్‌ ఇంటికి వెళ్లి టెలిఫోను బిల్లులు ఇచ్చుట వంటి డ్యూటీలు కూడా చేయిస్తున్నారని తెలిపారు. 01.01.2017 నుంచి వేతన సవరణ చేయాలని ఈ సమావేశం కోరింది. సంస్థ నష్టాల్లో ఉన్నందున వేతన సవరణ చేయలేమని చెప్పడం సరికాదని సమావేశం అభిప్రాయపడింది. గత నెల 30న ఉద్యోగ విరమణ చేసిన వి.రామయ్య దంపతులను, జీఎం కేఎస్‌వీ ప్రసాద్‌లను సన్మానించారు. అనంతరం జిల్లా ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గ ఎన్నిక
అధ్యక్షుడు– కె.సాంబశివరావు, ఉపాధ్యక్షులు– వి.రామయ్య, కె.మాణిక్యాలరావు, కార్యదర్శి– కేఎస్‌ఆర్‌ మూర్తి, సహాయ కార్యదర్శులు– బీవీవీఎంఎస్‌వీ ప్రసాద్, పి.సాంబశివ
రావు, డి.కోటేశ్వరరావు, ఎస్‌.అమీర్‌ సుల్తాన్, కోశాధికారి– సీహెచ్‌ రాంబాబు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు– పీవీవీ సత్యనారాయణ, సీహెచ్‌ జగదీశ్వరి, ఏవీ సత్యనారాయణ, ఎంవీ సత్యనారాయణ, వై.ప్రశాంత్‌ బాబులతో పాటు సభ్యులను ఎన్నుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top