మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయవరానికి చెందిన గొడచర్ల మంగమ్మ(45)ను ఆమె తమ్ముడు బొందయ్య సజీవదహనం చేశాడు.
లింగాల: మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయవరానికి చెందిన గొడచర్ల మంగమ్మ(45)ను ఆమె తమ్ముడు బొందయ్య సజీవదహనం చేశాడు. మానవత్వం మరచి..చిన్నవిషయానికే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. వివరాలు.. గొడచర్ల మంగమ్మకు సుమారు 20 ఏళ్ల క్రితం నిరంజన్‌తో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఏడేళ్ల క్రితం మంగమ్మకు మరో వ్యక్తితో రెండో వివాహం చేశారు. మూడేళ్లకే వారు విడిపోయారు. అప్పటి నుంచి మంగమ్మ పుట్టింట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం మంగమ్మకు ఆమె తమ్ముడు బొందయ్య భార్యతో ఘర్షణ జరిగింది. రాత్రి ఇంటికి వచ్చిన బొందయ్యకు ఘర్షణ విషయం తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న బొందయ్య అక్క మంగమ్మ వద్దకు వెళ్లి కిరోసిన్‌పోసి నిప్పటించాడు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.