శ్రీవారిని దర్శించుకున్న చిన్నారి శ్రీజ | Brain Tumor child Srija visit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న చిన్నారి శ్రీజ

Apr 8 2016 6:04 AM | Updated on Sep 3 2017 9:25 PM

శ్రీవారిని దర్శించుకున్న చిన్నారి శ్రీజ

శ్రీవారిని దర్శించుకున్న చిన్నారి శ్రీజ

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ కోలుకున్న చిన్నారి శ్రీజ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

సాక్షి,తిరుమల: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ కోలుకున్న చిన్నారి శ్రీజ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఖమ్మం జిల్లా పాల్వాంచ మండలానికి చెందిన శ్రీజ బ్రెయిన్‌ట్యూమర్‌తో బాధపడుతున్న సమయంలో  హీరో పవన్‌కల్యాణ్‌ను చూడాలని కోరుకుంది. ఆమె విజ్ఞప్తి మేరకు పవన్ ఆసుపత్రికి వచ్చి త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు.  అప్పటికి ఆమె స్పృహలో కూడా లేదు. ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. ఈ నేపథ్యంలో గురువారం కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement