గోపాలపురంలో ఇల్లు కూలి ఐదేళ్ల బాలుడి మృతి | Boy killed as wall collapses due to rain at Gopalpuram | Sakshi
Sakshi News home page

గోపాలపురంలో ఇల్లు కూలి ఐదేళ్ల బాలుడి మృతి

Oct 25 2013 1:20 PM | Updated on Sep 1 2017 11:58 PM

గోపాలపురంలో ఇల్లు కూలి ఐదేళ్ల బాలుడి మృతి

గోపాలపురంలో ఇల్లు కూలి ఐదేళ్ల బాలుడి మృతి

భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా తడిసిముద్దయింది. నాలుగు రోజులుగా 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించింది.

ఏలూరు: భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా తడిసిముద్దయింది. నాలుగు రోజులుగా 4 రోజులుగా  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాలకొల్లులో రైల్వేస్టేషన్ రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు సహా తదితర ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. లంకలకోడేరు మల్లవరం రోడ్డులోని వెలివెల రోడ్డుపై భగ్గేశ్వరం డ్రెయిన్  పొంగి ప్రవహిస్తోంది.

పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల మంచినీటి చెరువులోకి భారీగా వర్షపునీరు చేయడంతో తాగునీటికి ప్రజల ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షాలకు గోపాలపురంలో ఇల్లు కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. జిల్లావ్యాప్తంగా 70 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 60 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పొగాకు, చెరకు, కూరగాయల పంటలు తీవ్రంగా నష్టపోయాయి.  ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ సిద్దార్ధజైన్ పర్యటించారు. రెండు రోజల్లో పంట నష్ట అంచనాకు బృందాన్ని పంపుతామని కలెక్టర్ తెలిపారు.

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.5 వేల నష్టపరిహరం ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement