breaking news
gopalpuram
-
మేం అధికారంలో లేనప్పుడే అలా ఉంటే.. ఇప్పుడెలా ఉంటుందో..
-
తలారికి త్రుటిలో తప్పిన ప్రమాదం
అనంతపల్లి(నల్లజర్ల): వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో నల్లజర్ల మండలం శింగరాజుపాలెంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ముగించుకుని వెంకట్రావు కారులో స్వగ్రామం దేవరపల్లి వెళ్తుండగా అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వాహనం వచ్చింది. దీంతో ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి కారును ఎడమవైపునకు తిప్పి వంతెన దిమ్మెను ఢీకొన్నారు. ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. స్టీరింగ్ ఆయన ఛాతీని బలంగా తాకడంతో స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను తాడేపల్లిగూడెం ప్రసాద్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అనంతరం వెంకట్రావు దేవరపల్లి చేరుకున్నారు. డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పడంతో నల్లజర్ల మండలంలో జరగాల్సిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నియోజకవర్గంలోని నాయకులు శుక్రవారం తలారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. -
గిట్టుబాటు ధర అందేనా !
ఉదయగిరి, న్యూస్‌లైన్ : ఈ ఏడాదైనా తమకు గిట్టుబాటు ధర అందేనా అని పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది రైతులు అనేక ఒడిదుడుకుల మధ్య పొగాకు సాగు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు, కూలీల ఖర్చులు పెరగడంతో అనుకున్నదాని కంటే పెట్టుబడులు ఎక్కువయ్యాయి. దిగుబడి ఆశించిన మేర రాలేదు. దీంతో కొనుగోలుదారులు ఇచ్చే ధరపైనే రైతన్నలు ఆశపెట్టుకున్నారు. బయ్యర్ల దయా దాక్షిణ్యాలపైనే ఈ ఏడాది పొగాకు రైతుల జీవితాలు ముడిపడివున్నాయి. రాష్ర్టంలో ఈ ఏడాది 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి పొగాకు బోర్డు లక్ష్యంగా నిర్ణయించింది. రాష్ట్రంలో 1,22,695 హెక్టార్లలో ఈ ఏడాది పొగాకు సాగయింది. పొగాకును ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తారు. ప్రకాశం, నెలూరు జిల్లాల్లోని పొదిలి, కొండేపి, కందుకూరు, యల్లంపల్లి, ఒంగోలు, డీసీ పల్లి, కలిగిరి వేలం కేంద్రాల పరిధిలో 7,379 హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యల గూడెం, గోపాలపురం, ఖమ్మం జిల్లాలోని తొర్రేడు ప్రాంతంలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు. పెరిగిన ఖర్చులు సాధారణంగా 7.5 ఎకరాల విస్తీర్ణంలో పొగాకు ఒక బ్యారన్‌కు అనుమతిస్తారు. ఒక్కో బ్యారన్‌కు కనీసం రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చువుతుంది. ఎకరాకు ఐదు క్వింటాళ్ల మేర దిగుబడి రావాలి. అయితే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 3-4 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కూలీల కొరత అధికంగా ఉండటంతో ఒక బ్యారన్‌కు కేవలం కూలీలకే లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో సుదూర ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటిని తరలించి పంటను తడిపారు. దీంతో ఈ ఏడాది అదనంగా ఈ ఖర్చు కూడా పెరిగింది. సాధారణంగా ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చవుతుండగా, ఆ ఖర్చు ఈ ఏడాది రూ.50 వేల వరకు ఎగబాకింది. గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపు ఈ ఏడాది కర్ణాటకలో క్వింటాల్ పొగాకును రూ.18 వేల వరకు గరిష్టంగా కొనుగోలు జరిగింది. దీంతో అక్కడి పొగాకు రైతులు కొంతమేర లాభం పొందగలిగారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుంటే గతేడాది మన రాష్ట్రంలో క్వింటాల్‌కు సగటున రూ.10,200 అమ్మకం జరిగింది. గరిష్టంగా రూ.14,200 కాగా, కనిష్టంగా రూ.1000 పలికింది. ఈ ఏడా ది రూ.12 వేలు వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. దిగుబడి సగటున మూడు క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే రైతులకు నష్టాలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా వేలంలో 24 కంపెనీలు పాల్గొననున్నాయి. వీటిలో ఐటీసీ, జీపీఐ, అలయన్స్, పోలుశెట్టి, ఎంఎల్ కంపెనీలు కొనుగోలు చేయనున్నాయి. అయితే మొత్తం వ్యాపారంలో 50-60 శాతం పైగా ఒక్క ఐటీసీ కంపెనీ మాత్రమే కొనుగోలు చేయనుంది. అంటే ధరను ఈ కంపెనీ మాత్రమే నియంత్రించే పరిస్థితి ఉంది. మిగతా కంపెనీలన్నీ చిన్నా చితకవి కావడంతో ఐటీసీ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే పరిస్థితి కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఇవే ప్రకాశం జిల్లాలో పొదిలి, కొండేపి, కందుకూరు, యల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు, నెల్లూరు జిల్లాలో కలిగిరి, డీసీ పల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలో దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం, ఖమ్మం జిల్లాలో తొర్రేడు ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు ఈ నెల 17 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా, మరికొన్ని కేంద్రాల్లో మార్చి చివరలో ప్రారంభం కానున్నాయి. -
గోపాలపురంలో ఇల్లు కూలి ఐదేళ్ల బాలుడి మృతి
ఏలూరు: భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా తడిసిముద్దయింది. నాలుగు రోజులుగా 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాలకొల్లులో రైల్వేస్టేషన్ రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు సహా తదితర ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. లంకలకోడేరు మల్లవరం రోడ్డులోని వెలివెల రోడ్డుపై భగ్గేశ్వరం డ్రెయిన్ పొంగి ప్రవహిస్తోంది. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల మంచినీటి చెరువులోకి భారీగా వర్షపునీరు చేయడంతో తాగునీటికి ప్రజల ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షాలకు గోపాలపురంలో ఇల్లు కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. జిల్లావ్యాప్తంగా 70 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 60 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పొగాకు, చెరకు, కూరగాయల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సిద్దార్ధజైన్ పర్యటించారు. రెండు రోజల్లో పంట నష్ట అంచనాకు బృందాన్ని పంపుతామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.5 వేల నష్టపరిహరం ఇవ్వాలన్నారు.