విపక్షానిది మొండివైఖరి: బొండా | bonda umamaheswara rao slams ysrcp | Sakshi
Sakshi News home page

విపక్షానిది మొండివైఖరి: బొండా

Mar 13 2015 11:49 AM | Updated on Aug 18 2018 8:54 PM

విపక్షానిది మొండివైఖరి: బొండా - Sakshi

విపక్షానిది మొండివైఖరి: బొండా

ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు విమర్శించారు.

హైదరాబాద్: ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు విమర్శించారు. విపక్షం సభా సమయాన్ని వృధా చేస్తోందని ఆయన ఆరోపించారు. సభా సమయాన్ని ఉపయోగించుకోవడంలో ప్రతిపక్షం విఫలమైందన్నారు.

తామే మాట్లాలన్న మొండి వైఖరితో వైఎస్సార్ సీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. చిన్నపిల్లాడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు చందంగా విపక్షల సభ్యుల తీరు ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement