ర్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధిక స్థానాల్లో విజయం సాధించి బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధిక స్థానాల్లో విజయం సాధించి బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ దీక్ష కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొనడానికి వెళ్తూ మండల పరిధిలోని అంకుశాపూర్ గ్రామంలోకి వెళ్లి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర, తెలంగాణ ప్రజల్లో ద్వేషాన్ని నింపారన్నారు. ఇక్కడి ప్రజలు 60 సంవత్సరాలుగా తెలంగాణ కావాలని కోరుతున్నారని, సుమారు వెయ్యిమంది వరకు యువత, విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన సంగతిని విస్మరించి స్వార్థ రాజకీయాల కోసం ఉద్యమాన్ని ఎగదోస్తున్నారని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన యూపీఏకు కాలం చెల్లిందని, ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ సారథ్యం లోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అంకుశాపూర్ గ్రామ అభివృద్ధికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రయ్య, సర్పంచ్ అర్చన, వార్డు సభ్యురాలు పిట్టల మంగ, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బుచ్చయ్య, పార్టీ నాయకులు కరుణాకర్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్, మంజుల పాల్గొన్నారు.