రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడికి తీవ్ర గాయాలు | BJP leader serious injuries in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడికి తీవ్ర గాయాలు

Jun 5 2014 12:57 AM | Updated on Mar 29 2019 9:24 PM

స్టేట్ హైవేపై కొయ్యలగూడెంలోని హార్టిజన్ కాంప్లెక్స్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిబోయిన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.

కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : స్టేట్ హైవేపై కొయ్యలగూడెంలోని హార్టిజన్ కాంప్లెక్స్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిబోయిన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్ మోటార్ బైక్‌పై పొలం వెళ్తుండగా రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్‌తో సహా శ్రీనివాస్‌ను సుమారు 15 అడుగుల దూరం కారు ఈడ్చుకుపోయి ందని స్థానికులు తెలిపారు. బైక్‌ను ఢీకొన్న అనంతరం కారు రోడ్డు పక్కనున్న తుప్పల్లోకి దూసుకుపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను స్థానికులు 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైతు సంఘం నాయకుడు పిల్లా రామారావు, పలువురు బీజేపీ నాయకులు శ్రీనివాస్‌ను పరామర్శించడానికి జంగారెడ్డిగూడెం తరలి వెళ్లారు.
 

Advertisement
 
Advertisement
Advertisement