అప్పట్లో అంబేద్కర్‌ను ఓడించాలని ప్రయత్నిస్తే..

BJP Leader Muralidhar Rao Slams Congress Party In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేద్కర్‌ను ఎంపీగా ఓడించాలని అప్పట్లో కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే.. ఆయన్ని గెలిపించటానికి బీజేపీ అండగా నిలిచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. స్వాతంత్య్రం తర్వాత దళితుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉంటూ వచ్చిందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. దేశ విస్తృత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ప్రాంతాలకు అతీతంగా అంకితభావంతో పనిచేయటం బీజేపీ గొప్పతనంగా పేర్కొన్నారు.  అధికారంలో ఉన్నా లేకున్నా దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేసే పార్టీ బీజేపీ అన్నారు. రామ జన్మభూమి ఉద్యమం కోసం గ్రామ గ్రామానా శిలాన్యాస్ సేకరణ నుంచి రామ జన్మభూమి ట్రస్టు ఏర్పాటు వరకూ బీజేపీ పాత్ర ఉందన్నారు.

రామ జన్మభూమి ట్రస్టులో దళితులు తప్పనిసరిగా ఉండాలని ప్రధాని మోదీ పట్టుబట్టి నియమించారని తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో దళితులు లేకుండా ఏమీ జరగదని బీజేపీ గట్టిగా నమ్ముతోందన్నారు. దేశంలో 35 కోట్ల మందికి కనీసం బ్యాంకు అకౌంట్లు కూడా లేకుండా యాభై ఏళ్లు పరిపాలించారని, వారందరికీ జన్ దన్ ఖాతాలు తెరిపించిన చరిత్ర మోదీదేనని చెప్పారు. ఈ 35 కోట్లలో 70 శాతానికిపైగా దళితులు, గిరిజనులే ఉన్నారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top