జిల్లాలోని దేవనకొండ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.
సాక్షి, కర్నూలు: జిల్లాలోని దేవనకొండ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు బ్యాంకు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. శనివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు అధికారులు వచ్చిన తర్వాత నగదు ఎంత పోయిందా తెలిసే అవకాశాలు ఉన్నాయి.