తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె  | Bank Employees Protest In Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె 

Dec 26 2018 1:08 PM | Updated on Dec 26 2018 1:13 PM

Bank Employees Protest In Telugu States - Sakshi

సాక్షి, అమరావతి/ హైదరాబాద్‌ : బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టారు. విజయ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్‌లను విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బందరు రోడ్డులోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వద్ద బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బ్యాంక్‌ యూనియన్‌ ఐక్యవేదిక హెచ్చరించింది.

వైఎస్సార్‌ జిల్లా : బ్యాంక్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కడపలో బ్యాంక్‌ ఉద్యోగులు ధర్న చేపట్టారు. యూనైటెడ్‌ బ్యాంక్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 7 రోడ్స్‌ సర్కిల్‌లో ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ ​నిరసనలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌ : నగరంలోని ఆంధ్రాబ్యాంక్‌ జోనల్‌ ఆఫీస్‌ ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు బోసిపోయాయి. ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. 

విశాఖపట్నం : జిల్లాలోని 500పైగా బ్యాంకుల్లో ఉద్యోగులు విధులను బహిష్కరించారు. విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన సభ నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement