అది చంద్రబాబు, పవన్‌కే సాధ్యం: బాలినేని

Balineni Srinivasa Reddy Criticises Chandrababu, Pawan In ongole - Sakshi

సాక్షి, ఒంగోలు : పార్టీలు మారడం, పొత్తు పెట్టుకోవడం ఒక్క చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కే సాధ్యమవుతుందని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. మొన్నటి వరకు వామపక్ష పార్టీలతో కలిసి బీజేపీని తిట్టిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయనకే చెల్లుతందని మండిపడ్డారు. ఎవరు ఎనన్ని పొత్తులు పెట్టుకున్నా తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జంకే పరిస్థితే లేదని అన్నారు. తమ పార్టీ ఏకపక్షంగానే ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు ఒకటే స్టాండ్‌ మీద వున్నారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top