
ఆళ్ల నాని నియామకంపై బాలరాజు హర్షం
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)ని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం శుభదాయకమని ఆ పార్టీ మాజీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు.
జంగారెడ్డిగూడెం : వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)ని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం శుభదాయకమని ఆ పార్టీ మాజీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆళ్ల నాని నాయకత్వం జిల్లాకు అవసరమని చెప్పారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తానే జిల్లా కన్వీనర్ పదవికి రాజీనా మా చేశానని బాలరాజు చెప్పారు. పార్టీ బలోపేతానికి నానితో పాటు కృషి చేస్తానని ఆయన తెలిపారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి మాట్లాడుతూ ఆళ్ల నాని సమర్థ్ధత కలిగి న నాయకుడన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ పార్టీ కన్వీనర్ చనమాల శ్రీనివా స్, జీలుగుమిల్లి మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు
ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని బాలరాజు చెప్పారు. రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల రద్దు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు బండారం మూడు నెలలకే తెలిసిపోయిందని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రుణమాఫీ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు.