బాలకృష్ణకు పదవి ఇవ్వకుంటే టిడిపికి వ్యతిరేకత | Balakrishna Fans demand for a Position to Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు పదవి ఇవ్వకుంటే టిడిపికి వ్యతిరేకత

Mar 4 2014 6:28 PM | Updated on Aug 29 2018 1:59 PM

నందమూరి బాలకృష్ణ - Sakshi

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణకు సరైన పదవి ఇవ్వకుంటే ఈ ఎన్నికలలో టిడిపికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆయన అభిమానులు హెచ్చరించారు.

విశాఖపట్నం: నందమూరి బాలకృష్ణకు సరైన పదవి ఇవ్వకుంటే ఈ ఎన్నికలలో టిడిపికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆయన అభిమానులు హెచ్చరించారు. పాయకరావుపేటలో ఈరోజు బాలకృష్ణ అభిమానుల సంఘం సమావేశం జరిగింది. బాలకృష్ణకు ఏ పదవి ఇస్తున్నారో స్పష్టం చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు.

ఈ ఎన్నికల్లో బాలకృష్ణకు సరైన పదవి ఇవ్వకపోతే టిడిపిని వ్యతిరేకిస్తామని బాలకృష్ణ ఫ్యాన్స్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ చెల్లకొండ రమేష్ చెప్పారు. ఈ నెల 8న భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ సమావేశం కావాలని తీర్మానించారు.

ఇదిలా ఉండగా, బాలకృష్ణకు టిడిపి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement