రూ.35 లక్షల చెక్కు అందచేసిన బాలకృష్ణ | Balakrishna donates 35 Lakhs for hudhud cyclone victims | Sakshi
Sakshi News home page

రూ.35 లక్షల చెక్కు అందచేసిన బాలకృష్ణ

Oct 17 2014 10:46 AM | Updated on Aug 29 2018 1:59 PM

రూ.35 లక్షల చెక్కు అందచేసిన బాలకృష్ణ - Sakshi

రూ.35 లక్షల చెక్కు అందచేసిన బాలకృష్ణ

హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ కూడా భాగం పంచుకుంటుందని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

విశాఖ : హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ కూడా భాగం పంచుకుంటుందని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తుఫాను బాధితుల సహాయార్ధం రూ.35 లక్షల చెక్కును చంద్రబాబు అందించారు.

 

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ గతంలోనూ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ పని చేసిందన్నారు. ఎన్టీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారని ఆయన  గుర్తు చేశారు.  విశాఖకు అపారమైన నష్టం వాటిల్లిందని బాలకృష్ణ అన్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో కలిసి పర్యటించనున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement