
దర్యాప్తు పూర్తి అయినందునే బెయిల్:సోమయాజులు
దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పినందునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారా కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు చెప్పారు.
హైదరాబాద్: దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పినందునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారా కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ వారికి బాధేస్తున్నట్లుందన్నారు. దర్యాప్తు పూర్తికాలేదని చెప్పినంతకాలం జగన్‌కు బెయిల్ రాలేదన్నారు. సుప్రీం కోర్టు గడువు విధించడంతో సీబీఐ దర్యాప్తు ముగించిందని చెప్పారు.
తాము కాంగ్రెస్‌తో కలిసిపోయామని బీజేపీ నేత నిర్మలా సీతారామన్ అంటున్నారు. జగన్‌ను కాంగ్రెస్ వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలే చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. సుష్మాస్వరాజ్ చెప్పిన విషయాలు నిర్మలాసీతారామన్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని సోమయాజులు విమర్శించారు.