మావోయిస్టు నేత కోబడ్‌ గాంధీకి బెయిల్‌

Bail to Maoist leader Kobad Ghandy - Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు): మావో యిస్టు నేత కోబడ్‌ గాంధీ మంగళవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తూ మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు విశాఖ పోలీసులు గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 4 నుంచి విశాఖపట్నం జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులన్నీ మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినవే.

ఇంగ్లండ్‌లో సీఏ చదివి..
కోబడ్‌ గాంధీ ముంబైలో ధనిక పార్సీ కుటుంబంలో జన్మించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీతో కలిసి డెహ్రాడూన్‌ యూనివర్సిటీలో పీజీ చదివారు. ఇంగ్లండ్‌లో సీఏ అభ్యసించారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్య మరణించడంతో కుటుంబాన్ని వదిలేసి మావో యిస్టు ఉద్యమంలోకి వచ్చారు. కాగా, తనపై ఎనిమిది కేసు లున్నాయని, ఎనిమిదేళ్లపాటు వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవించానని కోబడ్‌ గాంధీ తెలిపారు. తీహార్‌  జైల్లో ఏడేళ్లు, చర్లపల్లి  జైల్లో్ల  నాలుగు నెలలు, విశాఖ  జైల్లో్ల తొమ్మిది నెలలు ఉన్నట్లు చెప్పారు. వీటి న్నింటికంటే విశాఖ జైల్‌ బాగుందని కితాబిచ్చారు. ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top