సింగవరంలో దారుణం | Atrocity at Singavaram | Sakshi
Sakshi News home page

సింగవరంలో దారుణం

Sep 8 2013 9:03 AM | Updated on Sep 1 2017 10:33 PM

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఓ భర్త అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అడ్డువచ్చిన అత్త, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికలు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ దాడిలో గాయపడిన వారిద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలి మృతదేహన్ని కూడా పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement