పేకాట ఆడుతూ చిక్కిన గాజువాక సహాయ కమిషనర్‌

Assistant Commissioner Caught Playing Cards In Gajuwaka Visakhapatnam - Sakshi

ఆగ్రహం వ్యక్తం చేసి వివరణ అడిగిన జీవీఎంసీ కమిషనర్‌

విశాఖపట్నం : జీవీఎంసీ గాజువాక జోనల్‌ సహాయ కమిషనర్‌ (రెవెన్యూ) పైడిరాజుపై జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక జోనల్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో గల కంప్యూటర్‌లో ఆయన పేకాట ఆడుతున్న వీడియోను ఒక వ్యక్తి కమిషనర్‌కు వాట్సాప్‌ ద్వారా పోస్టు చేశారు. దీన్ని పరిశీలించిన కమిషనర్‌ సంబంధిత అధికారిని వివరణ అడిగినట్టు తెలిసింది. ఆఫీసు పని వేళల్లో పేకాట ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు వివరణ పంపించాలని ఆదేశించినట్టు జీవీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై జీవీఎంసీ గాజువాక జోనల్‌ కమిషనర్‌ కూడా పైడిరాజును వివరణ అడిగినట్టు తెలిసింది. అయితే తెలియని కమాండ్‌ నొక్కడం వల్ల ఈ గేమ్‌ ఓపెన్‌ అయిందని ఆయన జోనల్‌ కమిషనర్‌కు చెప్పినట్టు జోనల్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top