కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు ప్రారంభం | APSRTC Union employees meeting with transport minister and rtc md | Sakshi
Sakshi News home page

కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు ప్రారంభం

May 13 2015 11:39 AM | Updated on Aug 20 2018 3:26 PM

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు బుధవారం హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ చర్చలకు శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో పాటు కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.

43 శాతం ఫిట్మెంట్ అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగలతో సమానంగా తమకు ఇవ్వాలని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చారు. వారు చేపట్టిన సమ్మె నేడు 8 వ రోజుకు చేరింది. అయితే అంత ఫిట్మెంట్ ఇవ్వలేమని చంద్రబాబు మంగళవారం తన కేబినెట్ భేటీలో పేర్కొన్నారు.

ఓ వేళ అంత ఫిట్మెంట్ ఇస్తే... ప్రజలపై ఛార్జీల భారం పడుతుందని ఆయన భావిస్తున్నారు. దాంతో ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణాశాఖ మంత్రి, ఎండీతో బుధవారం ఆర్టీసీ కార్మికులు చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement