స్విమ్స్ లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం | Applications invited for courses in svims | Sakshi
Sakshi News home page

స్విమ్స్ లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

May 21 2016 4:02 AM | Updated on Aug 17 2018 3:08 PM

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు

తిరుపతి కార్పొరేషన్: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని డెరైక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ శుక్రవారం తెలిపారు. బిఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎస్సీ పారామెడికల్, డిప్లొమో ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉన్నట్టు తెలిపారు. ఆసక్తిగల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఏదైనా మీ సేవ, ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా  జూన్ 3లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు స్విమ్స్ వెబ్‌సైట్ http://svimstpt.ap.nic.in లో సంప్రదించవచ్చని డెరైక్టర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement