ఉచిత కల్యాణాలకు మే 9 నుంచి దరఖాస్తులు:టీటీడీ ఈవో | Applications for free marriages from may9th :TTD EO | Sakshi
Sakshi News home page

ఉచిత కల్యాణాలకు మే 9 నుంచి దరఖాస్తులు:టీటీడీ ఈవో

Apr 29 2016 4:17 AM | Updated on Sep 3 2017 10:58 PM

ఉచిత కల్యాణాలకు మే 9 నుంచి దరఖాస్తులు:టీటీడీ ఈవో

ఉచిత కల్యాణాలకు మే 9 నుంచి దరఖాస్తులు:టీటీడీ ఈవో

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కల్యాణాల కోసం మే 9న అక్షయ తృతీయ పర్వదినం నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను..

తిరుపతి అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కల్యాణాల కోసం మే 9న అక్షయ తృతీయ పర్వదినం నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం తిరుపతిలోని పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజు నుంచి తిరుమలలోని కల్యాణ వేదికలో ఉచిత కల్యాణాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

ఉచిత దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం అప్లికేషన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే నూతన వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులకు రూ.300 దర్శనం క్యూ ద్వారా ఉచిత దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దర్శనానంతరం చిన్న లడ్డూలు, పసుపు, కుంకుమ పంపిణీ చేపట్టాల ని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement