24 నుంచి ఏపీ ఉద్యోగుల పైలెట్ షిఫ్టింగ్ | AP Secretaries met CS Takkar over empoyees issues | Sakshi
Sakshi News home page

24 నుంచి ఏపీ ఉద్యోగుల పైలెట్ షిఫ్టింగ్

Jun 20 2016 6:42 PM | Updated on Sep 4 2017 2:57 AM

సచివాలయ శాఖలు, ఉద్యోగులతో పాటు, శాఖాధిపతుల ఉద్యోగులను అమరావతికి తరలింపుపై కార్యదర్శులతో సీఎస్ టక్కర్ భేటీ అయ్యారు.

హైదరాబాద్: సచివాలయ శాఖలు, ఉద్యోగులతో పాటు, శాఖాధిపతుల ఉద్యోగులను అమరావతికి తరలింపు అంశంపై ఏపీ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం కార్యదర్శులతో  భేటీ అయ్యారు. తరలింపు వివరాలను కార్యదర్శులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 నుంచి పైలెట్ షిఫ్టింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే  ఐఏఎస్ అధికారులకు రేయిన్ ట్రీ అపార్ట్ మెంట్లు కేటాయించాలని నిశ్చయించారు.

Advertisement
 
Advertisement
Advertisement