ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Open 10th,Inter Supplementary Result 2019 declared - Sakshi

సాక్షి, అమరావతి: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం విడుదల చేశారు. 60 కేంద్రాల్లో 14,676  మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 9,382 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలలో 53.12శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 14,077 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 7,478మంది పాసయ్యారు. పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలవగా వైఎస్సార్‌​ జిల్లా చివరి స్థానంలో ఉంది.

ఇక ఇంటర్‌ ఫలితాల్లో 71.96 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జవాబు పత్రాల పునఃపరీశీలన, డూప్లికేట్ సర్టిపికేట్లు పొందే సదుపాయం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కమిటీ కల్పిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.  వీటికి నిర్ణీత రుసుం ద్వారా ఏపీ అన్ లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు.  9.8.2019 నుంచి 20.08.19 వరకు ఫీజ్ చెల్లింపులకు చివరి తేదీగా పేర్కొన్నారు. పూర్తి వివరాలు  www.apopenschool.org లో చూడవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top