ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు

Published Fri, Nov 1 2019 10:42 AM

AP Govt Celebrating Andhra Pradesh Incarnation Day - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతన్నారు. ఈ నేపథ్యంలో గుంటురు జిల్లా తాడేపల్లి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించి రాష్ట్రావతరణ వేడుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, చల్లా మధుసూదన్‌ రెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అయిదేళ్లపాటు చంద్రబాబు రాష్ట్రానికి అవతరణ దినోనత్సవం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. నవ నిర్మాణ దీక్షల పోరాటం పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్యు చేశారని, రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన పొట్టి శ్రీరాములుకు నివాళ్లు అర్పించే అవకాశాన్ని చంద్రబాబు పోగొట్టారని మండిపడ్డారు. నూతన ప్రభుత్వంగా ఏర్పడిన అనంతరం మళ్లీ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలు జరుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 


అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారని. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

పశ్చిమగోదావరి
గణపవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅవతరణ దినోత్సవ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే  నర్సాపురం  ఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ  దినోత్సవ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తూర్పుగోదావరి జిల్లా
రామచంద్రపురంలో  రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యపాన నిషేధానికి నాంది పలుకుతూ 20% శాతం దుకాణాలను తొలగించినందుకు హర్షం  వ్యక్తం  చేస్తూ మహిళలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమలో  ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సాఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి మెయిన్ రోడ్డులో ఎంపీ మార్గాని భరత్, కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల సత్యనారాయణ పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. 

గుంటూరు : 
బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి  డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నివాళులు అర్పించారు. అలాగే సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర వేడుకల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు..తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సబ్ కలెక్టర్ కె.దినేష్ కుమార్  పొట్టిశ్రీరాముల విగ్రహానికి పాలభిషేకం చేసి, నివాళులర్పించారు. పిడుగురాళ్లలో  ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవి క్రిష్ణ రెడ్డి...చిలకలూరిపేట వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మ్మెల్యే విడదల రజిని పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 

కృష్ణాజిల్లా
ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పామర్రు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

నెల్లూరు జిల్లా
ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన శ్రీ పొట్టి శ్రీ రాములుకు నెల్లూరులో ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కావలిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్య వైశ్య సంఘం మహా సభ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారాకానాథ్ ఆధ్వర్యంలో స్టోన్ హౌస్ పేట లో భారీ ర్యాలీ చేపట్టారు.  ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చరిత్రను భావితరాలకు అందివ్వాలని ఆర్య వైశ్య సంఘం నేతలు సూచించారు. పొట్టి శ్రీరాములు సేవలను చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర రాష్ట్ర అవతరణను జరపడం హర్షణీయమన్నా

ప్రకాశం
ఒంగోలులోని ఎన్టీఆర్ కళా పరిషత్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, కందుల నాగార్జున రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

విజయనగరం 
ఆంధ్ర రాష్ట్ర అవతరణ  దినోత్సవంపురస్కరించుకొని గుర్ల మండలం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విజయనగరం రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మజ్జి చిన్న శ్రీను పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరిపారు. అధే విధంగా సాలూరు పట్టణ మెయిన్ రోడ్‌లో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

విశాఖపట్నం
గాజువాకలో ఆర్యవ్తెశ్య సంఘం ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కులుకూరి మంగరాజు, కారమూరి మహేష్ పాల్గొన్నారు.

వైయస్సార్ జిల్లా
రాయచోటిలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ రోడ్డులో పోట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  

కర్నూల్
జిల్లాలోని మంత్రాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తహశీల్దారు కార్యాలయంలో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గోస్ఫాడు మోడల్ స్కూల్ లో  ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

చిత్తూరు.
జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటు కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి చేసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కేక్ కట్  చేశారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌తోపాటు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. 

అనంతపురం 
జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీంఅహ్మద్.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement