సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం | ap government invites sony company | Sakshi
Sakshi News home page

సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

May 14 2015 9:54 AM | Updated on Aug 29 2018 3:37 PM

సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం - Sakshi

సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

విదేశాల్లో కంపెనీలను తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానించేందుకు తెలుగు రాష్ట్రాల నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

జపాన్: విదేశాల్లో కంపెనీల పెట్టుబడులను తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానించే క్రమంలో ఉభయ రాష్ట్రాల నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే  తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ , తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు అమెరికా పర్యటనలో ఉండగా.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు.

 

టోక్యోలోని సోని కంపెనీని సందర్శించిన పల్లె,, ఆ సంస్థ వైస్ చైర్మన్ కాంబేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీని కాంబేకు మంత్రి వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం పూర్తిగా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయనకు పల్లె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement