సీఈసీని కలవనున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌

AP DGP RP Thakur to meet Election Commission of India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఈసీని కలవనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల  అమలుని ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం వివరణ కోరిన విషయం విదితమే. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  వివరణ తీసుకుంది. మరోవైపు ఏపీ ఇంటెలిఎన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదం వ్యవహారంపై డీజీపీని వివరణ కోరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసీతో పాటు కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లింది. మరోవైపు డీజీపీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

చదవండి...(డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై ఈసీకి ఫిర్యాదు)

ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top